
సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ మొదలైంది. ముందు ఏప్రిల్ మొదటి వారం అనుకున్న మహర్షి కాస్త ఏప్రిల్ చివరన అంటే 25న రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని అన్నాడు ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు. అయితే ఈమధ్యలో రీ షూట్స్ జరగడం.. సినిమా అవుట్ పుట్ మీద మహేష్ డిజప్పాయింట్ అవడం లాంటి వార్తలు రావడంతో సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని అన్నారు.
ఈ వార్తలన్నిటిని బ్రేక్ చేస్తూ మహర్షి అనుకున్న టైంకే అంటే ఏప్రిల్ 15న రిలీజ్ పక్కా అంటున్నారు చిత్రయూనిట్. మహర్షి సినిమాలో మహేష్ డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడట. సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దె నటిస్తుండగా.. అల్లరి నరేష్ కూడా మహర్షి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత హంగామా ఎలా ఉంటుందో చూడాలి.