
బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ కంగనా రనౌత్ సినిమాలతో ఎంత హంగామా చేస్తుందో వివాదాల్లో కూడా అంతే హడావిడి చేస్తుంది. ఈమధ్యనే మణికర్ణిక సినిమా విషయంలో క్రిష్, కంగనాల మధ్య మాటల యుద్ధం తెలిసిందే. తను తీస్తే మణికర్ణిక బంగారంలా ఉండేదని క్రిష్ చేసిన కామెంట్స్ ను ఇప్పుడు తిప్పి కొడుతుంది కంగనా. మణికర్ణికను వదిలిపెట్టి వచ్చి ఎన్.టి.ఆర్ బయోపిక్ తీశాడు క్రిష్.
అయితే క్రిష్ తీసిన ఎన్.టి.ఆర్ బయోపిక్ డిజాస్టర్ కావడంతో క్రిష్ బాలకృష్ణను మోసం చేశాడని.. ఈ టైంలో క్రిష్ ను నమ్మినందుకు బాలకృష్ణని చూస్తే జాలేస్తుందని అన్నది కంగనా. బాలకృష్ణ కెరియర్ కు మచ్చలా బయోపిక్ చేశాడని క్రిష్ మీద తన పగ తీర్చుకుంది కంగనా. మరి కంగనా కామెంట్స్ పై క్రిష్ రియాక్ట్ అవుతాడా లేక తర్వాత సినిమా హిట్ కొట్టి సమాధానం చెబుతాడా అన్నది చూడాలి.