
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ గా ఇప్పటికే ది ఐరన్ లేడీ అంటూ ప్రియదర్శిని డైరక్షన్ లో ఓ సినిమా వస్తుంది. ఆ సినిమాలో నిత్యా మీనన్ జయలలితగా నటిస్తుంది. ఇక ఇప్పుడు జయలలిత బయోపిక్ గా తళైవి సినిమా వస్తుంది. ఈ సినిమాను ఏ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాకు పర్యవేక్షకుడిగా ఉంటున్నారు విజయేంద్ర ప్రసాద్. బాహుబలి సినిమాతో అన్ని భాషల్లో అవకాశాలను అందుకుంటున్న విజయేంద్ర ప్రసాద్ ఈమధ్యనే మణికర్ణిక సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు.
ఇక ఇప్పుడు తళైవి సినిమాకు తన సపోర్ట్ అందిస్తున్నారు. ఏప్రిల్ లో మొదలు కానున్న ఈ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది ఇంకా తెలియలేదు. అసలైతే త్రిషాతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. సిని తారగా, ముఖ్యమంత్రిగా తమిళ ప్రజల హృదయాల్లో అమ్మగా నిలిచిన జయలలిత జీవిత చరిత్ర తెర మీద ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.