
నందమూరి కళ్యాణ్ రాం హీరోగా కెవి గుహన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 118. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు అటెండ్ అయ్యారు. జెఆర్సి కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకలో బాలకృష్ణ స్పీచ్ మళ్లీ అందరిని షాక్ అయ్యేలా చేసింది. సినిమా టైటిల్ 118 అయితే బాలయ్య బాబు 189 అని చెప్పడం జరిగింది. ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం ఇద్దరు బాలకృష్ణ చెవి దగ్గరకు వచ్చి సినిమా టైటిల్ 118 అని చెప్పినా బాలకృష్ణ మాత్రం మళ్లీ 189 అని చెప్పడం నందమూరి ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజ్ అయ్యేలా చేసింది.
సినిమాకు పనిచేసిన టీం అందరిని విష్ చేసిన బాలకృష్ణ ఎప్పుడు కొత్తగా ప్రయత్నిస్తూ కొత్త వారికి అవకాశం ఇస్తున్న కళ్యాణ్ రాం కు ఈ సినిమా సక్సెస్ అందించాలని అన్నారు. ఇక తారక్ గురించి కూడా మాట్లాడారు బాలయ్య. కళ్యాణ్, తారక్ ఇద్దరు తమ కుటుంబం నుండి హీరోగా ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని అన్నారు.