
కన్నడ పరిశ్రమలో భారీ బడ్జెట్ మూవీగా వచ్చిన సినిమా కె.జి.ఎఫ్. తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా ఒకేసారి రిలీజై సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా కన్నడ పరిశ్రమలో ఇప్పటివరకు ఏ సినిమా సృష్టించని రికార్డులను కొల్లగొట్టింది. 2018 డిసెంబర్ 21న రిలీజ్ అయిన ఈ సినిమా మౌత్ టాక్ తోనే హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాను ఈమధ్యనే రానా దగ్గుబాటు చూసి సినిమా సూపర్ అనేశాడు.
ఇక లేటెస్ట్ గా కె.టి.ఆర్ కూడా కె.జి.ఎఫ్ ను చూశారట. సినిమా చూసిన వెంటనే సినిమాను పొగుడుతూ ట్వీట్ చేశారు కె.టి.ఆర్. లేట్ గా కె.జి.ఎఫ్ సినిమా చూశాను.. చాలా బాగుంది.. టెక్నికల్ గా సినిమా అద్భుతంగా ఉంది.. డైరక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా బాగా తీశాడు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటుగా యాక్షన్ సీన్స్ బాగున్నాయని అనంటూ మెసేజ్ చేశారు. అంతేకాదు రాక్ స్టార్ యశ్ నటన అదిరిపోయిందని ట్వీట్ చేశారు.
కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సూపర్ సక్సెస్ అవగా సెకండ్ చాప్టర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సెకండ్ పార్ట్ లో బాలీవుడ్ యాక్టర్స్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటారని తెలుస్తుంది.