గ్యాంగ్ లీడర్ అవుతున్న నాని..!

నాచురల్ స్టార్ నాని తన కెరియర్ లో 24వ సినిమా విక్రం కుమార్ డైరక్షన్ లో నటిస్తున్నాడు. ఈమధ్యనే మొదలైన ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తుంది. సినిమాలో నాని నవలా రచయితగా కనిపిస్తాడట. ఇదిలాఉంటే ఈ సినిమాకు టైటిల్ గా మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ గ్యాంగ్ లీడర్ అని ప్రచారంలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఆల్రెడీ ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడట.

చిరంజీవి గ్యాంగ్ లీడర్ ఫుల్ మాస్ మూవీ.. కాని విక్రం లాంటి దర్శకుడు నాని లాంటి హీరోతో చేస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్ అని పెట్టడం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది. నాని పుట్టినరోజు ఫిబ్రవరి 24న ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటుగా ఫస్ట్ లుక్ వస్తుందట. ఐదుగురు హీరోయిన్స్ కాబట్టి నాని లేడీస్ గ్యాంగ్ లీడర్ లా కనిపిస్తాడా అని టైటిల్ గురించి తెలిసిన వాళ్లు అనుకుంటున్నారు. మరి నాని నిజంగా గ్యాంగ్ లీడర్ అవుతాడా లేదా అన్నది చూడాలి.