మహానాయకుడు మరీ ఇంత దారుణమా..!

క్రిష్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులు తెరకెక్కించారని తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్.టి.ఆర్ కథానాయకుడు, ఎన్.టి.ఆర్ మహానాయకుడు రెండు పార్టులుగా ఎన్.టి.ఆర్ సినిమా వచ్చింది. మొదటి సినిమాకు రిలీజ్ ముందు హంగామా బాగానే ఉన్నా ఆఫ్టర్ రిలీజ్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా సరే ఆ సినిమాకు ఓపెనింగ్ కలక్షన్స్ బాగానే వచ్చాయి.

ఇక మహానాయకుడు పరిస్థితి వేరుగా ఉంది.. అసలేమాత్రం సినిమాకు బజ్ లేదు. తెలుగు రెండు రాష్ట్రాల్లో 50% ఆక్యుపెన్సీ మాత్రమే ఏర్పడింది. ఇక వసూళ్ల విషయానికొస్తే ఎన్.టి.ఆర్ మహానాయకుడు మొదటి రోజు 1.57 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇది తెలుగు రెండు రాష్ట్రాల్లో వచ్చిన మొత్తం కలక్షన్ షేర్. 

బాలకృష్ణ కెరియర్ లో డిజాస్టర్ కా బాప్ అయిన పరమవీర చక్ర సినిమాకు కూడా ఇంతకంటే ఎక్కువ ఓపెనింగ్ డే కలక్షన్స్ వచ్చాయి. పెద్దాయన బయోపిక్ అని చెప్పి ఈ రేంజ్ లో ప్రమోట్ చేసినా సరే ప్రేక్షకులను మెప్పించలేదు.