
నందమూరి హీరో కళ్యాణ్ రాం ప్రస్తుతం 118 సినిమాతో మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సినిమాటోగ్రాఫర్ రసూల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతుంది. సినిమాలో కళ్యాణ్ రాం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తున్నాడు. రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు కళ్యాణ్ రాం.
ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత వెబ్ సీరీస్ నిర్మాణంపై దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నాడట కళ్యాణ్ రాం. ఆల్రెడీ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తున్న కళ్యాణ్ రాం కొత్తగా వెబ్ సీరీస్ ల మీద కన్నేశాడు. డిజిటల్ ఫ్లాట్ ఫాంలో వెబ్ సీరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. దాదాపుగా సినిమా రేంజ్ లో ఆ వెబ్ సీరీస్ లు ఉంటున్నాయి. అందుకే తాను కూడా వెబ్ సీరీస్ తీస్తా అంటున్నాడు కళ్యాణ్ రాం. అయితే వెబ్ సీరీస్ లో తాను మాత్రం నటించనని చెప్పాడు. ఈమధ్య మహేష్ కూడా వెబ్ సీరీస్ నిర్మిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. సో అదే దారిలో కళ్యాణ్ రాం కూడా వెబ్ సీరీస్ నిర్మిస్తాడని తెలుస్తుంది.