మహర్షి అనుకున్న టైంకు రాదా..!

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడు. కమర్షియల్ సినిమానే అయినా ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ అని అన్నారు. కాని ఇప్పుడు సినిమా అనుకున్న టైంకు రావడం కష్టమని తెలుస్తుంది.

సినిమాలో కొన్ని సీన్స్ పై మహేష్ అసంతృప్తిగా ఉన్నాడట. అందుకే వాటిని మళ్లీ రీ షూట్ చేయాలని అంటున్నాడట. ఆ ఎఫెక్ట్ సినిమా రిలీజ్ పై పడుతుందట. ఏప్రిల్ మిస్సైతే మే ఎలాగు మహేష్ కు కలిసి రాదు కాబట్టి మహర్షి ఇక జూన్ లో రిలీజ్ అనుకోవచ్చు. సంక్రాంతికి వస్తుందని అనుకున్న మహర్షి కాస్త 6 నెలలు వెనక్కి వెళ్లింది. మహేష్ ప్రతి సినిమాకు ఇలానే జరుగుతుంది. మహర్షి లేట్ అయితే మహేష్ చేయాలనుకున్న సుకుమార్ సినిమా మరింత లేట్ అవుతుంది. సో ఈ ఇయర్ కూడా మహేష్ ఒక్క సినిమాతో సరిపెడతాడని చెప్పొచ్చు.