
నిన్నటిదాకా స్టార్ హీరోల సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలేవి లేవు. తెలుగులో అవకాశాలు తగ్గాయని కోలీవుడ్ కు జంప్ అయిన రకుల్ ఈమధ్యనే కార్తి దేవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అది కూడా నిరాశపరచింది. ప్రస్తుతం సూర్య, సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో వస్తున్న ఎన్.జి.కే సినిమాలో నటిస్తుంది రకుల్. తెలుగులో మాత్రం సోలో ఛాన్సులు అందుకోవట్లేదు.
లేటెస్ట్ గా నాచురల్ స్టార్ నానితో ఓ ఐటం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట రకుల్. విక్రం కుమార్ డైరక్షన్ లో నాని హీరోగా చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ సాంగ్ చేస్తుందట. అసలు అవకాశాలేమి లేని టైంలో అమ్మడు వచ్చిన ఈ ఛాన్స్ ఎందుకు వదులుకోవాలని అనుకుందో ఏమో కాని నానితో ఐటం సాంగ్ కు ఓకే చెప్పిందట. ఈ సినిమాలో విలన్ గా ఆరెక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్నాడు. ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ సాంగ్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.