మహేష్ అతనికి ఛాన్స్ ఇస్తాడా..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి డైరక్షన్ లో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇంత బిజీ షెడ్యూల్ తో ఉన్న మహేష్ తో అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

మహేష్ తో ఇప్పుడు సినిమా ఓకే చేసుకున్నా సరే అది రెండేళ్ల తర్వాత సెట్స్ మీదకు వెళుతుంది. అనీల్ రావిపుడి మాత్రమే కాదు మహేష్ తో సినిమా చేయాలని రాజమౌళి కూడా ప్లానింగ్ లో ఉన్నాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత మహేష్ తోనే రాజమౌళి సినిమా అని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఇన్ని కమిట్మెంట్స్ లో మహేష్ ఎలా డేట్స్ అడ్జెస్ట్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం చేస్తున్న మహర్షి సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ ప్లాన్ చేశారు. మార్చిలోనే సుకుమార్ సినిమా ముహుర్తం పెట్టి ఈ ఇయర్ ఎండింగ్ లోనే ఆ సినిమా రిలీజ్ ఉండేలా చూస్తున్నారు. మరి ఒకే సంవత్సరంలో మహేష్ రెండు సినిమాలు అది సాధ్యమయ్యే పనేనా అన్నది చూడాలి.