కంటెస్టంట్స్ కు ఎన్టీఆర్ కండీషన్స్..!

బిగ్ బాస్ 3వ సీజన్ హడావిడి మొదలు కాబోతుంది. మొదటి రెండు సీజన్ల లానే ఈ 3వ సీజన్ బిగ్ బాస్ ను ఎంతో ప్రత్యేకంగా ఉండేలా చూస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. హోస్ట్ గా ఎన్.టి.ఆర్ దాదాపుగా కన్ఫాం అవ్వగా ఇందుకోసం తారక్ 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అంతేకాదు కంటెస్టంట్స్ విషయంలో కూడా ఎన్.టి.ఆర్ కొన్ని కండీషన్స్ పెట్టినట్టు చెబుతున్నారు.

బయట క్లోజ్ గా ఉన్న వారిని హౌజ్ లోకి పంపిస్తే అక్కడ గ్రూపులుగా ఏర్పడి షో కాన్సెప్ట్ దెబ్బ తీస్తున్నారని అసలు ఒకరికి ఒకరు సంబంధం లేని వారిని తీసుకుంటే బెటర్ అని సలహా ఇచ్చాడట. మొదటి సీజన్ ఎలా ఉన్నా రెండో సీజన్ లో ఈ గ్రూపుల గోల ఎక్కువైంది. అందుకే అలాంటిదేమి లేకుండా ఈసారి జాగ్రత్త పడుతున్నారు. అంతేకాదు కేవలం నటీనటులే కాకుండా అన్ని రంగాల వారిని కంటెస్టంట్స్ గా తీసుకోవాలని తారక్ చెప్పాడట. మొత్తానికి హోస్ట్ గా తనపని మాత్రమే అన్నట్టు కాకుండా షోకి కలిసి వచ్చే అంశాలను ప్రస్థావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈసారి హోస్ట్ గా తారక్ అయితే కంటెస్టంట్స్ గా ఎవరెవరు వస్తారో చూడాలి.