నిఖిల్ వెనక్కి తగ్గాడు..!

నిఖిల్ హీరోగా సంతోష్ డైరక్షన్ లో వస్తున్న సినిమా అర్జున్ సురవరం. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ కణితన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు ముందు ముద్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ పై నిర్మాత నట్టి కుమార్ తో గొడవ తెలిసిందే. తమ సినిమా టైటిల్ ను తమ పర్మిషన్ లేకుండా వాడేశాడని నట్టి కుమార్ గొడవకి దిగాడు. అయితే నిఖిల్ అండ్ టీం ముద్రని కాస్త నిఖిల్ ముద్ర అని టైటిల్ మార్చినా లాభం లేకుండా పోయింది.

అయితే సిని పెద్దల జోక్యంతో నిఖిల్ ను కాంప్రమైజ్ చేసి అతన్నే టైటిల్ మార్చుకునేలా చేశారు. నిఖిల్ ముద్ర కాస్త ఇప్పుడు అర్జున్ సురవరం గా మారింది. సినిమా టైటిల్ తో పాటుగా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు చిత్రయూనిట్. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తున్న ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ ఫిక్స్ చేశారు. అర్జున్ సురవరంగా మారిన నిఖిల్ ముద్ర సినిమా ఎలా ఉంటుందో చూడాలి.