
యాంగ్రీ యంగ్ మ్యాన్ కాస్త యాంగ్రీ స్టార్ గా మారితే.. ఏంటి అదెలా కుదురుద్ది అనుకోవచ్చు. అప్పట్లో పవర్ ఫుల్ పాత్రల్లో బాక్సాఫీస్ షేక్ చేసిన రాజశేఖర్ కొన్నాళ్లుగా కెరియర్ లో చాలా వెనుకపడి ఉన్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన పిఎస్వి గరుడవేగ సినిమా మళ్లీ రాజశేఖర్ సత్తా ఏంటో ప్రూవ్ చేసింది. ఆ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో రాజశేఖర్ కల్కి చేస్తున్నారు.
అ! సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ ఈరోజు రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. టీజర్ లో రాజశేఖర్ ఎంట్రీ సీన్ మాత్రమే ఉంది. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే యాంగ్రీ యంగ్ మెన్ స్క్రీన్ నేమ్ కాస్త యాంగ్రీ స్టార్ గా మార్చేశారు. తన కూతురు హీరోయిన్ గా చేస్తున్న తరుణంలో యంగ్ మ్యాన్ అంటే కష్టమని యాంగ్రీ స్టార్ గా స్క్రీన్ నేమ్ మార్చేసుకున్నాడు రాజశేఖర్. పిరియాడికల్ మూవీగా వస్తున్న కల్కి సినిమా టీజర్ లో పెద్దగా కథ చెప్పకున్నా రాజశేఖర్ మరో హిట్ కొడతాడని మాత్రం అనిపిస్తుంది.