'యాత్ర' మొదటి టికెట్ రికార్డ్ ప్రైజ్

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వస్తున్న యాత్ర సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వైఎస్సార్ పాత్రలో మళయాళ స్టార్ మమ్ముట్టి నటించిన ఈ సినిమాను మహి వి రాఘవ్ డైరెక్ట్ చేశారు. వైఎస్ పాదయాత్ర నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రీసెంట్ గా హైదరబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందని తెలిసిందే.  

బయోపిక్ ల హవా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో వైఎస్సార్ బయోపిక్ గా వస్తున్న ఈ యాత్ర సినిమా మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఫిబ్రవరి 8 సినిమా రిలీజ్ అవుతుండగా ఓ రోజు ముందే అనగా ఫిబ్రవరి 7న యూఎస్ లో భారీ స్థాయిలో ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు నిర్మాతలు విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి. ఈ సినిమా మొదటి టికెట్ వేలంపాట సియాటెల్ లో జరుగగా.. మునీశ్వర్ రెడ్డి రికార్డ్ ప్రైజ్ లో యాత్ర మొదటి టికెట్ సొంతం చేసుకున్నారు.  

వేలం పాటలో 6,116 డాలర్స్ తో యాత్ర టికెట్ సొంతం చేసుకున్నారు మునీశ్వర్ రెడ్డి. మన కరెన్సీలో దాదాపుగా నాలుగున్నర లక్షలకు అటు ఇటుగా వస్తుంది. వైఎస్ మీద అభిమానంతో మునీశ్వర్ రెడ్డి యాత్ర టికెట్ బిడ్డింగ్ రూపంలో కొన్నారు. అయితే అంతమొత్తం పెట్టి టికెట్ కొన్నా టికెట్ ప్రైజ్ 12 డాలర్స్ మాత్రమే నిర్మాతలు తీసుకుని మిగతా మొత్తాన్ని వైఎస్సార్ ఫౌండేషన్, రాజన్న క్యాంటీన్స్, వాటర్ ప్లాంట్స్ కు సహాయంగా ఇస్తామని ప్రకటించారు. వచ్చిన డబ్బులతో తమ జేబులు నింపుకోకుండా సహాయానికి ఉపయోగించడం చూస్తుంటే యాత్ర నిర్మాతలు విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డిలది ఎంత గొప్ప మనసో అర్ధమవుతుంది. సినిమాను ప్రజలందరి దగ్గరకి చేర్చేలా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమాపై బజ్ కూడా బాగానే ఏర్పడింది. మరి ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.