వైభవంగా 'యాత్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్..!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా మహి వి రాఘవ్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా యాత్ర. వై.ఎస్.ఆర్ పాదయాత్ర నేపథ్యంలో వస్తున్న ఈ యాత్ర సినిమా ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డి ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్ది గంటల క్రితం చిత్రయూనిట్ సమక్షంలో జరిగింది. వైఎస్ అభిమానులు ఎంతోమంది ఈ ఈవెంట్ కు అటెండ్ అవడం విశేషం. 

చిత్రయూనిట్ అంతా సినిమా చేస్తున్నప్పుడు వారి అనుభవాలను పంచుకున్నారు. 

దర్శకుడు మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. ఒక్క నిమిషం అన్నా.. తాను రాజన్న అభిమాని నుండి జగనన్న అభిమానిని ఎందుకయ్యానని తర్వాత చెబుతానని మొదలు పెట్టిన దర్శకుడు మహి వి రాఘవ్. మమ్ముట్టి గారికి నేను చెప్పింది ఏమి లేదు.. మీరేం చూస్తున్నారో అది అంతా ఆయన గొప్పగనమే.. సినిమా కోసం అందరి సహకారం కావాల్సి ఉంటుంది.. కేవలం ఈ సినిమా కథ తనది అక్కడ నుండి మొదలైన ఈ ప్రయాణం ఆర్టిస్టులు, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ ఇలా అందరి సహకారంతో పూర్తి చేశాం. కెమెరా మెన్ సత్య అద్భుతంగా పనిచేశారు. మీరు చూసిన విజువల్స్ కు ఆయనే కారణం. అందరు సినిమా చేయడానికి చాలా కష్ట పడ్డామని చెబుతుంటారు. కాని వీళ్లందరు తనని సుఖంగా పనిచేయించారని అన్నారు మహి వి రాఘవ్. కష్టమంతా వారే పడ్డారు.. ఈ సినిమాకు డైరక్షన్ డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడ్డారని అన్నారు.   

ఇక సినిమా తీస్తున్న టైంలో రెండు సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగిందని.. కలిసిన రెండు సార్లు ఆయన మీ నాయకుడి సినిమా మీకు ఇష్టం వచ్చినట్టు తీయండని చెప్పారు. అంతేకాదు ఆయన చేసిన మంచి పనులు గురించి చెప్పండి చాలు మిగతా ఏమవసరం లేదని అన్నారని చెప్పాడు మహి వి రాఘవ్. ఎంతో మంది మహానుభావుల కథలు ఉంటాయి.. కాని తనకు వైఎస్సార్ కథ రాయాలనిపించింది. అందుకే రాశాను ఆ తర్వాత నిర్మాతలు దొరకడం ఇంత మంచి సినిమా అయ్యిందని అన్నారు. మేము చేయాల్సింది చేశాం.. ఇక వైఎస్ అభిమానులుగా మీరు చేయాల్సింది చేయండి. ఇది కేవలం వై.ఎస్ అభిమానులకు మాత్రమే కాదు అందరు చూసే సినిమా అన్నారు మహి వి రాఘవ్. 

మమ్ముట్టి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. తాను తెలుగు మాట్లాడలేను.. కాని నాకు తెలుగు అర్ధమవుతుంది. కొంత టైం ఇస్తే నేను తెలుగు మాట్లాడగలుగుతాను.. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఈ సినిమాలో తాను తెలుగు మాట్లాడేందుకు సహకరించిన డైరక్టర్, అసోసియేట్ డైరక్టర్ తో పాటుగా సౌండ్ ఇంజినీర్ శ్రీనివాస్ తన డబ్బింగ్ కు ఎంతో సహకరించారని అన్నారు మమ్ముట్టి. శ్యాం దత్ ద్వారా ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యాను. ఇక దాదాపు 23 ఏళ్ల తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా చేశాను. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ అనగానే ఆయన మరణం మీద ఇన్వెస్టిగేషనా అనుకున్నా అందుకే డైరక్టర్, ప్రొడ్యూసర్ కథ చెప్పమని అడిగాను. ఆ నరేషన్ నచ్చి సినిమా చేశాను. సినిమా మొదలు పెట్టాడనికి ముందే డైలాగ్స్ నేర్చుకున్నాను. 

తెలుగులో తనకు ఇది 3వ సినిమా ఈ సందర్భంగా డైరక్టర్ కె.విశ్వనాథ్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను.. రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులను ఉద్దేశించి మీకు ఆయన మీద చాలా అభిమానం ఉంది. అందులో 1 పర్సెంట్ నా మీద ఉంచి ఈ సినిమా చూడండని అన్నారు మమ్ముట్టి. ఇక ఇప్పటితో మా పని పూర్తయింది ఇప్పటినుండి మీ పని మొదలైంది.. దీన్ని పెద్ద సినిమాగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని ప్రసంగాన్ని ముగించారు. వైఎస్ అభిమానుల కోరిక మేరకు నాకు వినబడుతుందయ్యా.. విన్నాను.. నేనున్నాను అంటూ మెప్పించారు మమ్ముట్టి.