బిగ్ బాస్-3 ఎన్టీఆర్ ఫిక్సా..!

త్వరలో మొదలు కానున్న బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా ఎవరు చేస్తున్నారు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. బిగ్ బాస్ సీజన్ 1 ఎన్.టి.ఆర్ హోస్ట్ గా సూపర్ సక్సెస్ అవగా సెకండ్ సీజన్ లో నాని మెప్పించాడు. ఇక ఇప్పుడు మూడవ సీజన్ లో మళ్లీ ఎన్.టి.ఆర్ ను హోస్ట్ గా దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అంటూ రోజుకో పేరు వినిపిస్తుండగా ఫైనల్ గా ఎన్.టి.ఆర్ హోస్ట్ గా ఓకే చెప్పినట్టు టాక్ వినపడుతుంది.

ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో ఉన్న తారక్ ను రాజమౌళి అంత తేలికగా వదిలిపెడతాడా అంటే ఈ సీజన్ హోస్ట్ గా చేస్తే 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తామని బంపరాఫర్ ఇచ్చారట బిగ్ బాస్ నిర్వాహకులు. అంత ఇస్తామంటే ఏ స్టార్ అయినా వద్దంటాడా.. అందుకే దాదాపుగా ఎన్.టి.ఆరే బిగ్ బాస్ హోస్ట్ గా ఫిక్స్ అని అంటున్నారు. ఇక ఈమధ్య కంటెస్టంట్స్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ లిస్ట్ ఫైనలా కాదా అన్నది తెలియాల్సి ఉంది.