రానా 1945కు బడ్జెట్ కష్టాలు..!

దగ్గుబాటి రానా హీరోగా సత్యశివ డైరక్షన్ లో వస్తున్న సినిమా 1945. స్వాతంత్రానికి ముందు జరిగిన కథతో పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో రానా సరసన రెజినా కసాండ్రా నటిస్తుంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందట. సినిమాకు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ పెట్టేశారట. ఇప్పుడు సినిమా పూర్తి చేయాలంటే కొంత బడ్జెట్ పెట్టాల్సి ఉందట. 

రానా తన రెమ్యునరేష్న్ కూడా రిటర్న్ ఇచ్చి సినిమా పూర్తి చేయాలని చెప్పాడట. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాజర్, సత్యరాజ్ లు నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా రానా గుణశేఖర్ డైరక్షన్ లో హిరణ్యకశ్యప సినిమా చేయాలని చూస్తున్నాడు. ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తుంది.