పాయల్ రాజ్ పుత్ కు బంపరాఫర్..!

ఆరెక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న భామ పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కార్తికేయతో అమ్మడు చేసిన రొమాన్స్ అందరిని అలరించింది. ఇక ఆ తర్వాత పాయల్ తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న పాయల్ మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న డిస్కో రాజా సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఇవే కాకుండా కింగ్ నాగార్జున చేయబోతున్న మన్మథుడు సీక్వల్ సినిమాలో కూడా పాయల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని అంటున్నారు. నాగార్జున సరసన అంటే కచ్చితంగా పాయల్ కు లక్కీ ఛాన్స్ అన్నట్టే. రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న మన్మథుడు-2 ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తారట. మరి నాగ్ తో పాయల్ రొమాన్స్ ఎలా ఉంటుందో సినిమా వస్తేనే కాని చెప్పలేం.