
మెగా హీరో వరుణ్ తేజ్ విలన్ గా ప్రయోగాత్మకంగా చేస్తున్న సినిమా వాల్మీకి. హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్ తండా రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ డాన్ గా నటిస్తున్నాడు. తమిళ సినిమాలో ఈ పాత్రని బాబి సింహా పోశించగా హీరోగా సిద్ధార్థ్ నటించాడు. అయితే ఇప్పుడు తెలుగులో హీరోగా సిద్ధార్థ్ ను అడిగినా అతను ఇంట్రెస్ట్ లేదన్నట్టు చెప్పాడట.
ఇక ఆ పాత్రలో శ్రీవిష్ణుని ఒప్పించారని తెలుస్తుంది. ఆల్రెడీ తమిళ జిగుర్తండా చూసిన శ్రీవిష్ణు వాల్మీకి సినిమాకు ఓకే చెప్పాడట. శ్రీవిష్ణు ఫిల్మ్ డైరక్టర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. వరుణ్ తేజ్ విలన్ గా నటించడమే ఈ ప్రాజెక్టుకి స్పెషల్ ఎట్రాక్షన్ కాగా వరుణ్ తేజ్ ను ఢీ కొడుతూ శ్రీవిష్ణు చేయడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. మరి వరుణ్ తేజ్ వాల్మీకి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.