సిఎం కాబోతున్న బాలకృష్ణ..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ఆ సినిమాతో నిరాశపరచాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ మహానాయకుడుకి రిపేర్లు చేస్తున్న క్రిష్ అండ్ టీం సినిమా ప్రేక్షకులను మెప్పించేలా జాగ్రత్త పడుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా కన్ఫాం చేశాడు బాలకృష్ణ. మార్చి నుండి మొదలవనున్న ఈ సినిమాలో బాలకృష్న సిఎంగా కనిపిస్తాడట.

అసలే ఏపిలో ఎలక్షన్స్ సీజన్ నడుస్తుండగా సిఎంగా బాలకృష్ణ నటించడం హాట్ న్యూస్ గా మారింది. బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఆల్రెడీ సింహా, లెజెండ్ సినిమాలు చేశాడు బాలకృష్ణ. హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. ఈ మూవీని బాలకృష్ణ సొంత బ్యానర్ అయిన ఎన్.బి.కే బ్యానర్ లో నిర్మిస్తాడట. మరి సిఎంగా బాలకృష్ణ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.