వెంకీ మామలో రానా..?

ఎఫ్-2 సక్సెస్ తో మళ్లీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న విక్టరీ వెంకటేష్ ఎఫ్-2 తర్వాత సినిమాను కూడా మల్టీస్టారర్ చేస్తుండటం విశేషం. బాబి డెరక్షన్ లో వస్తున్న వెంకీ మామ సినిమాలో వెంకటేష్ తో పాటుగా నాగ చైతన్య నటిస్తున్నాడు. కోనా ఫిల్మ్ కార్ప్ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీలో సర్ ప్రైజ్ రోల్ లో రానా దగ్గుబాటి కూడా కనిపిస్తాడని తెలుస్తుంది. వెంకీ, రానా, చైతన్య ఇలా దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఒకే సినిమాలో కనిపిస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు.  

ఫిబ్రవరి 21 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీయ శరణ్ నటిస్తుండగా.. నాగ చైతన్యకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. వెంకీ మామాలో ఇంకా చాలా సర్ ప్రైజులు ఉన్నాయట. వెంకీ మామ సినిమా కచ్చితంగా మళ్లీ వెంకటేష్ హిట్ మేనియాని కంటిన్యూ చేసేలా ఉంటుందని అంటున్నారు.