
అక్కినేని అఖిల్ హిరోగా ఈమధ్యనే రిలీజైన మిస్టర్ మజ్ ను సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాపై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే యూత్ ఆడియెన్స్ మెచ్చే అంశాలు ఉన్నా కథ, కథనంలో కొత్తదనం లేకపోవడంతో సినిమాను ఆడియెన్స్ తిప్పికొట్టారు. ప్రస్తుతం వచ్చిన కొద్దిపాటి టాక్ ను కలక్షన్స్ గా మార్చుకునేందుకు అఖిల్ అండ్ టీం థియేటర్ కవరేజ్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ ఎవరి డైరక్షన్ లో సినిమా చేస్తాడు అన్నది పెద్ద చర్చగా మారింది. అయితే అఖిల్ శ్రీను వైట్ల డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. అఖిల్ కు ఈమధ్యనే శ్రీను వైట్ల ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథ చెప్పాడట. లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పడం జరిగిందట. దాదాపుగా అఖిల్, శ్రీను వైట్ల కాంబినేషన్ సినిమా కన్ఫాం అయినట్టే అంటున్నారు.
అయితే అఖిల్ మాత్రమే కాదు శ్రీను వైట్ల పరిస్థితి అదేలా ఉంది. బ్రూస్ లీ నుండి అమర్ అక్బర్ అబ్దుల్లా వరకు శ్రీను వైట్ల వరుస ఫ్లాపులు తీశాడు. మరి ఏ నమ్మకంతో శ్రీను వైట్లతో అఖిల్ సినిమా చేస్తున్నాడో అని అక్కినేని ఫ్యాన్స్ టెన్షన్ పెట్టుకున్నారు.