
నా పేరు సూర్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా తండ్రి కొడుకుల సెంటిమెంట్ కథతో వస్తున్నాడట త్రివిక్రం. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్ అందుకోగా హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఈ మూవీ వస్తుంది. ఇక ఈ సినిమా కోసం బన్నిని వెయిట్ తగ్గాల్సిందిగా కోరాడట త్రివిక్రం.
సినిమా కోసం బన్ని స్లిం లుక్ ట్రై చేస్తున్నాడట. అరవింద సమేత కోసం తారక్ తో సిక్స్ ప్యాక్ చేయించిన త్రివిక్రం బన్నిని మాత్రం తగ్గమని చెప్పాడట. ప్రస్తుతం అల్లు అర్జున్ ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడని తెలుస్తుంది. ఫిబ్రవరి 14న మొదలు కానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.