
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో హీరోయిన్స్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై నేషనల్ మీడియా ఫోకస్ ఉంది. అందుకే ఈ సినిమాలో హీరోయిన్స్ గా అక్కడివారికే మొదట ప్రిఫరెన్స్ ఇస్తున్నాడట రాజమౌళి.
కొన్నాళ్లుగా ఆర్.ఆర్.ఆర్ లో బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా నటిస్తుందని వార్తలు వచ్చాయి. వాటిల్లో వాస్తవం ఎంత ఉంది అన్నది తెలియలేదు. ఇక లేటెస్ట్ గా పరిణితి బదులుగా అలియా భట్ ట్రిపుల్ ఆర్ లో నటిస్తుందని అంటున్నారు. కరణ్ జోహార్ ప్రమేయంతో అలియాకు ఈ ఛాన్స్ వచ్చిందట. అయితే ఇది అలియా స్నేహితురాలు బయట పెట్టడంతో ఆర్.ఆర్.ఆర్ లో అలియా కన్ఫాం అనేస్తున్నారు.
బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగులో సినిమా చేయాలంటే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. రాజమౌళి సినిమా కాబట్టి కాస్త తగ్గించుకునే అవకాశం ఉంది. మరి ఆర్.ఆర్.ఆర్ లో హీరోయిన్స్ ఎవరు అన్నది ప్రస్తుతానిక్ సస్పెన్సే. అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తేనే కాని తెలియదు.