
విజయ్ సేతుపతి, త్రిష లీడ్ రోల్స్ లో ప్రేమ్ కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా 96. కోలీవుడ్ లో లాస్ట్ ఇయర్ రిలీజైన సినిమాల్లో ఇది సూపర్ హిట్ అందుకుంది. విజయ్, త్రిషలతో పాటుగా వారి చిన్నప్పటి పాత్రలు చేసిన ఆర్టిస్టులు కూడా ఆకట్టుకున్నారు. 96 సినిమాలో విజయ్ సేతుపతి చిన్నప్పటి రోల్ లో ఆదిత్య భాస్కర్ నటించగా.. త్రిష చిన్నప్పటి పాత్రలో గౌరీ కిషన్ నటించారు.
సినిమాలో వారి ఎపిసోడ్ కూడా హైలెట్ గా నిలిచింది. ఇదిలాఉంటే తెలుగు రీమేక్ లో చిన్ననాటి హీరో, హీరోయిన్ పాత్రల కోసం ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఏకంగా కాస్టింగ్ కాల్ ఏర్పాటు చేశాడు. 14 నుండి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వారెవరైనా ఈ ఆడియెన్స్ లో పాల్గొనవచ్చు. ఒకవేళ వారికి శర్వానంద్, సమంత పోలికలు ఉంటే మొదటి ప్రిఫరెన్స్ ఉంటుంది. మొత్తానికి దిల్ రాజు 96 రీమేక్ తెలుగులో కూడా అదే రేంజ్ హిట్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.