
టాక్సీవాలా తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా డియర్ కామ్రెడ్. భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ విధ్యార్ధి నాయకుడిగా కనిపిస్తాడట. ఇక ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు ఈ యువ హీరో. ఆ సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. అయితే లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ కార్మికుడిగా ఖాకి డ్రెస్ లో దిగిన పిక్ ఒకటి బయటకు వచ్చింది.
ఆ స్టిల్ ప్రస్తుతం చేస్తున్న డియర్ కామ్రెడ్ సినిమాలోది అని కొందరు అంటుంటే క్రాంతి మాధవ్ సినిమా కూడా సింగరేణి కోల్ మైన్ కాన్సెప్ట్ తోనే వస్తుందని అందుకే విజయ్ ఆ కాస్టూం వేసుకున్నాడని అంటున్నారు. అది ఏ సినిమా అయినా సరే విజయ్ ఖాకి డ్రెస్ లో మాత్రం అదరగొట్టాడు. చేసిన 6 సినిమాలతోనే స్టార్డం ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాల మీద గురి పెట్టాడని తెలుస్తుంది.