అకిరా నందన్ అదిరిపోయే లుక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మొదటి సంతానం అకిరా నందన్. పవన్ తో విడిపోయి ఉంటున్నా సరే పవన్ వారసుడు అంటే అకిరా నందన్ అని ఫిక్స్ అయ్యారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అందుకే అకిరాకు క్రేజీ ఫాలోవర్స్ ఏర్పడ్డారు. అకిరా నందన్ కు సంబందించి ఓ ఫోటో బయటకు వచ్చినా అది సెన్సేషన్ అవుతుంది. లేటెస్ట్ గా అకిరా నందన్ స్టైలిష్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. హెడ్ సెట్ పెట్టుకుని ఉన్న అకిరా లుక్ అదిరిపోయింది.

చూస్తుంటే పవన్ వారసుడిగా అకిరా కూడా సినిమాల్లోకి వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన వారసుడిగా అకిరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తే మాత్రం అతన్ని కూడా మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ అక్కున చేర్చుకుంటారు. అయితే అకిరా నందన్ టీనేజ్ లో ఉన్నాడు కాబట్టి ఇంకాస్త పెద్దయ్యాక సినిమాల్లోకి రావడం కన్ఫాం అంటున్నారు. ఏది ఏమైనా పవన్ పోలికలతో ఉన్న అకిరా తండ్రి వేసిన పూల బాటలో వెళ్తాడా లేదా అన్నది చూడాలి.