
కొన్నాళ్లుగా కెరియర్ లో చాలా వెనుకపడి ఉన్న డైరక్టర్ తేజ లాస్ట్ ఇయర్ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమా మళ్లీ తేజ ని హిట్ ట్రాక్ లోకి తెచ్చింది. ఇక ఎన్.టి.ఆర్ బయోపిక్ ముందు తేజ చేయాలని అనుకున్నా అది కాస్త క్రిష్ చేతుల్లోకి వెళ్లింది. ఆ సినిమా నుండి బయటకు వచ్చిన తేజ బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా మొదలుపెట్టాడు. తనకు కలిసి వచ్చిన కాజల్ ను ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా తీసుకున్నాడు తేజ.
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ ఇప్పటికే కవచం సినిమాలో నటించారు. ఇక ఇప్పుడు మళ్లీ కలిసి తేజ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ గా సీత అని కన్ఫాం చేశారు చిత్రయూనిట్. ఈమధ్య మీడియాతో ముచ్చటించిన కాజల్ ఈ సినిమా టైటిల్ రివీల్ చేసింది. అఫిషియల్ గా బెల్లంకొండ శ్రీనివాస్, తేజ సినిమా టైటిల్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిపబ్లిక్ డే సందర్భంగా శనివారం రిలీజ్ చేస్తారట. కవచంతో నిరాశరచిన బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమాతో అయినా హిట్ కొడుతాడేమో చూడాలి.