'స్టార్ మహిళ' సుమ..!

రెండు దశాబ్ధాలుగా యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల ఎన్నో అరుదైన రికార్డులను తన సొంతం చేసుకున్నారు. షో ఏదైనా సుమ వ్యాఖ్యాతగా వస్తే అది సూపర్ హిట్ అన్నట్టే.. ముఖ్యంగా రియాలిటీ గేమ్ షోలకు సుమ కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఏ ఛానెల్ పెట్టిన సరే బుల్లితెర మీద సుమ చేసే సందడి అందరికి తెలిసిందే. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక షో సుమ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.

ఒకటి, రెండు కాదు ఏకంగా 11 ఏళ్లుగా ఒకే షోకి వ్యాఖ్యతగా ఉంటూ యాంకర్ సుమ ఇండియాలోనే ఏ యాంకర్ కూడా సాధించని రికార్డ్ కొట్టింది. ఈటివిలో ప్రసారమయ్యే స్టార్ మహిళ షో మహిళలకు ఎంతో ఇష్టం. 2008 లో మొదలైన ఈ షో ఇప్పటికి కొనసాగుతుంది. 11 ఏళ్లుగా 2 వేల ఎపిసోడ్స్ దాకా సుమ చేసినట్టు తెలుస్తుంది. ఇలా చేయడం కేవలం సుమ ఒక్కదాని వల్లే అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. తన మాటలతో ఎలాంటి షో అయినా సుమ ఇట్టే అలరించేస్తుంది. ఇప్పటికే ఈ షో లిం కా బుక్ రికార్డుల్లో చేరగా ఇప్పటికి స్టార్ మహిళ కొనసాగుతూనే ఉంది. మరి ఇలానే చేస్తూ గిన్నీస్ బుక్ లో కూడా రికార్డ్ సాధించేలా ఉంది సుమ.