
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. మహర్షి సినిమా మహేష్ 25వ సినిమాగా రాబోతుంది. అందుకే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి ఈ సినిమా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో 1 నేనొక్కడినే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మహేష్, సుకుమార్ ఈసారి హిట్ టార్గెట్ తో రాబోతున్నారట. ఇక ఈ సినిమాకు సంబందించిన కథ సింహాచలం అడవి నేపథ్యంలో ఉంటుందట. మరి సింహాచలం అడవుల్లో మహేష్ కు ఏం పని.. సుక్కు మహేష్ తో ఏం చేయిస్తున్నాడు అన్నది ఎక్సైటింగ్ గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం చేస్తున్న మహర్షి సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ ఫిక్స్ చేశారు.