
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లెప్పుడు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్స్ ప్రశ్న. ఎప్పుడో బాహుబలి బిగినింగ్ నుండి ప్రభాస్ పెళ్లిపై ఎవరికి తోచింది రాస్తూనే ఉన్నారు. ప్రభాస్ కనిపిస్తే చాలు సినిమా ముచ్చట్ల కన్నా ముందు పెళ్లెప్పుడో చెప్పండి సార్ అంటూ మొదలెట్టేస్తారు. బాహుబలి తర్వాత కచ్చితంగా ఓ ఇంటివాడవుతాడని భావించిన ప్రభాస్ సైలెంట్ గా సాహో సినిమా మొదలుపెట్టాడు.
ఈమధ్యలో పెళ్లెప్పుడు అని అడిగినా సరైన సమాధానం రాలేదు. అయితే ఈమధ్య రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకల్లో దొరికాడు ప్రభాస్. పెళ్లిపై ఓ మాట చెప్పాల్సిందే అని పట్టుబడితే సాహో తర్వాత పెళ్లికి రెడీ అనేశాడు. అయితే ఇలా చెప్పిన చాలా సందర్భాల్లో ప్రభాస్ లైట్ తీసుకున్నాడు. మరి ఈసారైనా మాట మీద నిలబడి పెళ్లి ముచ్చట కానిస్తాడా మళ్లీ టైం పాస్ మాటలతో గడిపేస్తాడా అన్నది వేచి చూడాలి. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సాహో సినిమా ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.