
పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో దర్శక నిర్మాతగా పూరినే సినిమా మొత్తం బాధ్యత మీద వేసుకున్నాడు. సినిమాకు సహ నిర్మాతగా ఛార్మి కౌర్ వ్యవహరిస్తుంది. ఈమధ్య ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు నుండి సెట్స్ మీదకు వెళ్లింది. సినిమా ఫస్ట్ లుక్ తో కిరాక్ అనిపించిన పూరి ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడేమో చూడాలి.
ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే సినిమాకు సంబందించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా కథను పూరి చాలా జాగ్రత్తగా రాసుకున్నాడట. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్న పూరి సినిమాలో ట్విస్టులు అదరగొట్టాడట. పూరి సినిమా ట్విస్టులంటే వెంటనే గుర్తొచ్చేది మహేష్ బాబు పోకిరి. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులన్నిటిని బ్రేక్ చేసిన సినిమా అది. అలాంటి కథతోనే ఇస్మార్ట్ శంకర్ వస్తుందట. మరి ఈ సినిమా నిజంగానే పూరిని హిట్ టాక్ ఎక్కించేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి.