
ఎన్.టి.ఆర్ బయోపిక్ డైరక్షన్ ఛాన్స్ తనకే వస్తుందని భావించిన ఆర్జివి అది కాస్త క్రిష్ చేతుల్లోకి వెళ్లే సరికి ఆ కసితో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంటూ ఎన్.టి.ఆర్ జీవిత కథలోని మరో యాంగిల్ తో వస్తున్నాడు ఆర్జివి. తాను చెప్పే కథే అసలు ఎన్.టి.ఆర్ బయోపిక్ అంటూ చెప్పుకొస్తున్న వర్మ పోస్టర్స్ తో షాక్ ఇస్తున్నాడు. ఇక వెన్నుపోటు సాంగ్ తో డైరెక్ట్ గా చంద్రబాబుని టార్గెట్ చేసిన ఆర్జివి సినిమాను అనుకున్నట్టుగానే ప్రమోట్ చేస్తున్నాడు.
వెన్నుపోటు సాంగ్ రిలీజ్ తర్వాత వర్మ మీద టిడిపి కార్యకర్తలు, ఎమ్మెల్యేలు గొడవకు దిగారు. పిఠాపురం ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ మాత్రం ఏకంగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాపై హైకోర్ట్ లో పిల్ దాఖలు చేశాడు. వర్మ వేసిన పిల్ విచారించిన హైకోర్ట్, చిత్రయూనిట్ నుండి మూడు వారాల్లో వివరణ కోరింది. జనవరి 24న రిలీజ్ ఎవరు అడ్డుకుంటారో చూస్తానని చెప్పిన వర్మకు మొదటి షాక్ తగిలినట్టే. అయితే వర్మ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. రిలీజ్ ముందే ఇంత హంగామా చేస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ తర్వాత ఇంకెలా ఉండబోతుందో చూడాలి. ఇది పక్కా వైసిపి నేతలు వెనుక ఉండి నడిపిస్తున్నారంటూ కొందరు టిడిపి కార్యకర్తలు అంటున్నారు. తీయడం అయితే పూర్తి చేసిన ఆర్జివి సినిమా రిలీజ్ చేయగలడా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.