ఎఫ్-3లో ట్రిపుల్ ధమాకా..!

ఈ సంక్రాంతికి సూపర్ హిట్ మూవీగా నిలిచిన ఎఫ్-2 మూవీ ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లను సాధిస్తుంది. ఇప్పటికి హౌజ్ ఫుల్ కలక్షన్స్ తో సత్తా చాటుతున్న ఎఫ్-2 మరోసారి విక్టరీ వెంకటేష్ సత్తా ఏంటో చూపిస్తుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చింది. ఇక ఈ సినిమా ఎండ్ కార్డ్ లో ఎఫ్-3 అంటూ ఊరించాడు అనీల్.   

అంతేకాదు సినిమా సక్సెస్ మీట్ లో ఎఫ్-2 పక్కా ఉంటుందని ఎనౌన్స్ చేశారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎఫ్-3లో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా మాస్ మహరాజ్ రవితేజ కూడా ఉంటాడని అంటున్నారు. అనీల్ రావిపుడితో రవితేజ రాజా ది గ్రేట్ సినిమా చేసి హిట్ అందుకున్నాడు. ఎఫ్-3 కోసం మరింత ఫన్ యాడ్ చేసి రవితేజ కూడా ఉంటే ఇక ఆడియెన్స్ కు ట్రిపుల్ ధమాకా అన్నట్టే. మరి ఈ సినిమా స్క్రిప్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. దిల్ రాజు డిసైడ్ అయ్యాడంటే ఎఫ్-3 కూడా ముగ్గురు స్టార్స్ తో మల్టీస్టారర్ షురూ అయినట్టే.