
మిస్టర్ మజ్ను రిలీజ్ ముందే అక్కినేని అఖిల్ ఫుల్ జోష్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. సినిమా ఫస్ట్ కాపీ చాలా శాటిస్ఫైడ్ గా ఉందని తప్పకుండా ఆడియెన్స్ కు నచ్చేస్తుందని టాక్ వచ్చింది. సెన్సార్ నుండి కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా అఖిల్ కు తొలి విజయాన్ని అందిస్తుందని అంటున్నారు. ఇక ఈ ఉత్సాహంలో అఖిల్ తన తోటి స్టార్స్ ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో కలిసి దిగిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
మిస్టర్ మజ్ను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఆ ఈవెంట్ తర్వాత ఎన్.టి.ఆర్, అఖిల్, రాం చరణ్ కలిసి పార్టీ చేసుకున్నట్టు తెలుస్తుంది. ముగ్గురు కలిసి సరదాగా దిగిన పిక్ బయటకు వచ్చింది. ఎన్.టి.ఆర్, చరణ్ రేంజ్ స్టార్ డం తెచ్చుకునే స్టఫ్ ఉన్న అఖిల్ వాళ్లతో క్లోజ్ నెస్ పెంచుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ మెగా నందమూరి అక్కినేని హీరోల కలయిక ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది.