
మహి వి రాఘవ్ డైరక్షన్ లో వైఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వస్తున్న సినిమా యాత్ర. వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంతో వస్తున్న ఈ యాత్ర మూవీ ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో వైఎస్సార్ గా మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. జననేతగా ప్రజల హృదయాలను గెలిచిన వై.ఎస్ జీవిత కథలోని ముఖ్య అంశాలను యాత్ర సినిమాలో ప్రస్థావించడం జరిగిందని తెలుస్తుంది.
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ఈరోజు పూర్తి చేసుకుంది. సింగిల్ కట్ కూడా లేకుండా సెన్సార్ వాళ్లు యాత్ర సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ అందించారు. 2 గంటల 6 సెకన్ల రన్ టైంతో యాత్ర సినిమా వస్తుంది. వై.ఎస్ పాత్రలో మమ్ముట్టి నటన అందరిని ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కిన ఈ సినిమాను విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మించారు.