
ప్రస్తుతం సౌత్ లో సూపర్ ఫాంలో ఉన్న హీరోయిన్ ఎవరు అంటే కీర్తి సురేష్ అని చెప్పొచ్చు. మహానటి సినిమాతో మరో మెట్టు ఎక్కిన కీర్తి సురేష్ కోలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటుంది. రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో సర్కార్ సినిమాలో నటించిన కీర్తి మురుగదాస్, రజినికాంత్ కాంబో సినిమాలో ఛాన్స్ దక్కించుకుందట. ఈ సినిమాతో పాటుగా విజయ్, అట్లీ డైరక్షన్ లో మూవీలో కూడా కీర్తి సురేష్ నటిస్తుందని తెలుస్తుంది.
ఇక వరుసగా అక్కడ సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ చెన్నైలో సొంత ఫ్లాట్ కొనుక్కుందట. హీరోయిన్స్ ఫ్లాట్ కొన్నది అంటే అది ఎవరు గిఫ్ట్ ఇచ్చారు అన్న వార్తలు రావడం కామన్. కీర్తి సురేష్ విషయంలో కూడా అదే జరిగింది. ఓ స్టార్ హీరో కీర్తికి ఆ ఫ్లాట్ కొనిచ్చాడని కోలీవుడ్ సిని వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇప్పటికే అతనితో ఒక సినిమాలో నటించిన కీర్తి సురేష్ మరో సినిమాకు సైన్ చేసిందట. మరి హీరో నిజంగానే కీర్తికి ఫ్లాట్ ఇప్పించాడా లేదా అన్నది మాత్రం వారికే తెలియాలి.