రౌడీ హీరోతో వెంకీ..?

తెలుగులో ఈమధ్య సెన్సేషనల్ హీరోగా మారిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లాస్ట్ ఇయర్ గీఎతా గోవిందం, టాక్సీవాలా సినిమాలతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ తర్వాత సినిమా వెంకీ అట్లూరి డైరక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. యువ దర్శకుడు వెంకీ అట్లూరి మొదటి సినిమా తొలిప్రేమతో హిట్ అందుకోగా అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేశాడు.

ఈ శుక్రవారం రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఫలితాన్ని బట్టి వెంకీ, విజయ్ ల కాంబో సినిమా కన్ ఫాం అవుతుందట. రౌడీ హీరోతో వెంకీ అట్లూరి సినిమా కచ్చితంగా అంచనాలు ఏర్పరచుకుంటుంది. ఈ సినిమాకు సంబందించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో వెళ్లడించనున్నారు. విజయ్ దేవరకొండ సినిమాల లైనప్ చూస్తుంటే స్టార్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఒకటి రెండు సినిమాల అనుభవం ఉన్న డైరక్టర్స్ తో విజయ్ సంచలన విజయాలు అందుకుంటున్నాడు.