ఇండియన్ 2 ఇంకెంతమంది బాసు

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇండియన్. ఆ సినిమాకు సీక్వల్ గా కొన్నాళ్లుగా సినిమా ప్రయత్నాలు జరుగుతున్నా ఫైనల్ గా దానికి ముహుర్తం కుదిరింది. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని చెబుతున్నారు చిత్రయూనిట్. కమల్ హాసన్ సేనాపతి పాత్రతో పాటుగా మరో రోల్ లో కూడా కనిపిస్తాడు.  

ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్ విలన్ గా నటిస్తాడని చెప్పారు. అయితే అజయ్ కు డేట్స్ ఖాళీ లేవని ఆ ఛాన్స్ మళ్లీ అక్షయ్ కుమార్ కు ఇచ్చాడట. ఇప్పుడు అక్షయ్ తో పాటుగా ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో అభిషేక్ కనిపిస్తాడని అంటున్నారు. అజయ్, అక్షయ్, అభిషేక్ ఇలా ముగ్గురు బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారంటూ వస్తున్న ఇండియన్ 2లో అసలు ఎవరున్నారు అన్నది చిత్రయూనిట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తేనే తెలుస్తుంది.