
పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణ రావు మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన తర్వాత పరిశ్రమలో మంచి చెడులు చూసే వారే లేరని చెప్పాలి. శతాధిక చిత్ర దర్శకుడిగా దర్శకరత్న దాసరి నారాయణ రావు తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో మంచి చిత్రాలు అందించారు. ఆయన జ్ఞాపకార్ధం ఫిల్మ్ నగర్ లో ఇప్పటికే విగ్రహావిష్కరణ జరుపగా దాసరి స్వస్థలం అయిన పాలకొల్లులో దాసరి విగ్రహం ప్రతిష్టించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
దాసరి విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో దాసరి ప్రియ శిష్యుడు డా. మోహన్ బాబు ఈ కార్యక్రమాలను దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఈ నెల 26 గణతంత్ర దినోత్సవం నాడు పాలకొల్లులో దాసరి విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలుస్తుంది. దాని కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. దాసరి శిష్యులు, అభిమానులతో పాటుగా సిని పెద్దలు, రాజకీయ వేత్తలు కూడా దాసరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొననున్నారు.