మహేష్26 టైటిల్ అదేనా..!

మహర్షి సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా కన్ఫాం చేసిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కథా చర్చలు ముగిశాయి. మహేష్ మహర్షి ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తుండగా ఆ సినిమా పూర్తయ్యాక సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. ఆల్రెడీ సుకుమార్ తో మహేష్ 1 నేనొక్కడినే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

అందుకే ఈ సినిమా పకడ్బందీ స్క్రిప్ట్ తో వస్తున్నాడట సుకుమార్. రంగస్థలం సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్న సుకుమార్ మహేష్ బాబుకి హిట్ ఇవ్వాలని కసితో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు టైటిల్ గా హర హర శంభో శంకర అని పెట్టబోతున్నారట. సుకుమార్ కో డైరక్టర్ ఫిల్మ్ చాంబర్ లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడట. అదేంటి మైత్రి మేకర్స్ కదా రిజిస్టర్ చేయాల్సింది అంటే వాళ్లు చేయిస్తే అది కచ్చితంగా మహేష్ కే అని తెలుస్తుందని.. ఫస్ట్ లుక్ పోస్టర్ దాకా దాచాలనే ఉద్దేశంతో సుకుమార్ ఇలా ప్లాన్ చేశాడట. కాని కో డైరక్టర్ తో చేయించినా ఈ టైటిల్ మహేష్ కోసమే అని అందరు అనుకుంటున్నారు. మరి అఫిషియల్ గా చెప్తేనే కాని ఏ విషయం అన్నది కన్ఫాం చేయలేం.