
నందమూరి కళ్యాణ్ రాం హీరోగా కె.వి.గుహన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 118. ప్రయోగాత్మకంగా వస్తున్న ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రాం విరించి వర్మ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. షార్ట్ ఫిల్మ్ తో తన సత్తా చాటిన విరించి వర్మ ఉయ్యాల జంపాల సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత నాచురల్ స్టార్ నానితో మజ్ను సినిమా చేశాడు విరించి వర్మ.
మజ్ను తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వర్మ ఫైనల్ గా కళ్యాణ్ రాం కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేశాడట. కళ్యాణ్ రాం స్టోరీ వినడం వర్మకు ఓకే చెప్పడం అంతా జరిగిందట. 118 షూటింగ్ కంప్లీట్ చేయగానే ఈ సినిమా మొదలు పెడతాట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మరి కళ్యాణ్ రాం తో వర్మ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.