
అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. ఈనెల 25న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ 19న జె.ఆర్.సీ కన్వెన్షన్ లో ప్లాన్ చేశారు. మొదటి సినిమా తొలిప్రేమతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి సెకండ్ మూవీగా మిస్టర్ మజ్ ను వస్తుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడట. ఈమధ్య ఒక హీరో ఈవెంట్ కు మరో హీరో స్పెషల్ గెస్టులుగా వచ్చి ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్నారు. మహేష్ భరత్ అనే ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ గెస్ట్ గా రాగా ఆ తర్వాత తారక్ అఖిల్ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా వస్తున్నాడు. అఖిల్ చేసిన ముందు రెండు సినిమాలు నిరాశపరచగా మిస్టర్ మజ్ నుతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్.