మహర్షి వాయిదా పడుతుందా..!

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మహర్షి. మహేష్ 25వ సినిమాగా వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. దిల్ రాజు, అశ్వనిదత్, పరం వి పొట్లూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ముందు ఏప్రిల్ 6న రిలీజ్ అనుకున్నారు. అయితే అనుకున్న టైం కు షూటింగ్ పూర్తి చేయడం కుదరదని సినిమా రిలీజ్ ను ఏప్రిల్ చివరకు వాయిదా వేస్తున్నారట. 

అదీగాక నాని జెర్సీ, నాగ చైతన్య మజిలి రెండు సినిమాలు ఏప్రిల్ 5 రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. మహర్షి వాయిదా అని తెలిశాకే ఆ సినిమాలు రిలీజ్ ఎనౌన్స్ చేసి ఉండొచ్చని కొందరు అంటున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 26న మహర్షి రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయట. ఏప్రిల్ నెలలో అది కూడా చివరన వచ్చిన మహేష్ సినిమాలన్ని సూపర్ హిట్లుగా నిలిచాయి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న మహర్షి మూవీలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మరి మహర్షి కూడా వాటి సరసన చేరుతుందో లేదో చూడాలి.