ఎన్టీఆర్, చరణ్ 10 నెలల డీల్..!

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ నటించడంతో ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2018 అక్టోబర్ లో మొదలైన ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 21 నుండి సెకండ్ షెడ్యూల్ మొదలు పెడుతున్నారని తెలుస్తుంది.

రాజమౌళి సినిమా అంటే ఎన్నేళ్లు పడుతుందో లెక్క ఉండదు. తను అనుకున్న అవుట్ పుట్ వచ్చేదాకా బడ్జెట్ పెంచుతాడేమో కాని కాంప్రమైజ్ మాత్రం కాడు రాజమౌళి. బాహుబలి కోసం ప్రభాస్ ఏకంగా మూడేళ్ల కెరియర్ రాసిచ్చేశాడు. అందుకు తగిన క్రేజ్ దక్కించుకున్నా ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ కోసం మాత్రం ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు కేవలం 10 నెలల టైం కేటాయించినట్టు తెలుస్తుంది. ఇద్దరి హీరోలను తమ 10 నెలల డేట్స్ మాత్రం అడిగాడట రాజమౌళి. 

రాజమౌళి సినిమాకు సంవత్సరం పాటు డేట్స్ అని ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆ సినిమా అవుట్ పుట్ ఎలా ఉంటుందో ఊహించుకుంటే అది చాలా తక్కువే అని చెప్పొచ్చు. వినయ విధేయ రామ తర్వాత చరణ్, అరవింద సమేత తర్వాత ఎన్.టి.ఆర్ ఇద్దరు ఫ్రీ అయ్యారు. సో ఈ ఇయర్ ఎండింగ్ వరకు షూటింగ్ పూర్తి చేసి 2020 సమ్మర్ లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ చేయాలని చూస్తున్నాడు రాజమౌళి. మరి అనుకున్న టైం కు సినిమా ఫినిష్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.