
మళయాళ ప్రేమం సినిమాతో సౌత్ ఆడియెన్స్ ను అలరించిన సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో ప్రేక్షకులందరిని ఫిదా అయ్యేలా చేసుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన ఎం.సి.ఏ సినిమా కూడా హిట్ కొట్టడంతో సాయి పల్లవి క్రేజ్ డబుల్ అయ్యింది. తెలుగులోనే కాదు తమిళంలో కూడా సాయి పల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అక్కడ ధనుష్ తో మారి-2 సినిమాలో నటించిన సాయి పల్లవి ఆ సినిమాలో హీరో పాత్రకి తగినట్టుగా హీరోయిన్ కూడా ఊర మాస్ పాత్రలో నటించింది సాయి పల్లవి.
ఇక ఈ సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ అయితే సాయి పల్లవి కెరియర్ బెస్ట్ అని చెప్పొచ్చు. సినిమాలో ఆ పాట అలరిస్తుండగా ఆ సాంగ్ వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మారి-2 మేకర్స్. ధనుష్, సాయి పల్లవిల రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్ లో పెట్టిన రెండు గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పటికే ఆ సాంగ్ కు కోటి పైగా వ్యూస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. లైకులు కూడా 4 లక్షల దాకా వచ్చాయట. యూట్యూబ్ ట్రెండింగ్ లో రౌడీ బేబీ సాంగ్ 3వ స్థానంలో ఉంది అంటే ఈ సాంగ్ ప్రేక్షకులకు ఏ రేంజ్ లో నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. డిసెంబర్ 21న రిలీజైన మారి-2 సినిమాను బాలాజీ మోహన్ డైరెక్ట్ చేశారు.