
100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత బాలకృష్ణ తన సినిమాల స్పీడ్ పెంచారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వస్తున్న రెండు పార్టులను అనుకున్న టైం కు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ బిజీగా ఉన్న బాలకృష్ణ తన తర్వాత సినిమాను బోయపాటి శ్రీను డైరక్షన్ లో చేస్తున్నాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ ఈవెంట్ లోనే బోయపాటి సినిమా ఎనౌన్స్ చేశారు.
ఇక ఇది కాకుండా బాలకృష్ణ మరో సినిమాకు చూచాయగా ఓకే చెప్పారట. అనీల్ రావిపుడి డైరక్షన్ లో బాలకృష్ణ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. డైరక్టర్ అనీల్ రావిపుడి ఇప్పటికే ఈ విషయాన్ని కన్ ఫాం చేశారు. సంక్రాంతికి వస్తున్న వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్-2 డైరెక్ట్ చేసిన అనీల్ రావిపుడి తన తర్వాత సినిమా బాలయ్యతోనే అని అంటున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.