
పూరి డైరెక్ట్ చేసిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ పెద్దగా క్లిక్ అవలేదని చెప్పాలి. బాలీవుడ్ లో అరకొర అవకాశాలతో కెరియర్ సాగిస్తున్న అదా శర్మ సోషల్ ఫ్లాట్ ఫాం మీద కూడా రెచ్చిపోతుంది. పూనం పాండే స్పూర్తితో తన ఫాలోవర్స్ ను ఎంటర్టైన్ చేస్తూ అదా చేసే హాట్ షో అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. అయితే అదా చేస్తున్న ఈ క్రేజీ వీడియోస్ లో చిన్న మెసేజ్ కూడా ఉండేలా చూసుకుంటుంది.
మొన్నామధ్య స్మోకింగ్ కిల్స్ అంటూ ఓ మెసేజ్ తో కూడిన హాట్ వీడియో పెట్టిన అదా శర్మ లేటెస్ట్ గా బెల్లీ డ్యాన్స్ చేస్తూ బీరు తాగుతూ అదరగొట్టింది. ఫైనల్ ట్విస్ట్ కూడా అందరిని షాక్ అయ్యేలా చేసింది. అయితే ఇచ్చిన మెసేజ్ కన్నా అదా చేసిన ఆ స్కిన్ షో మీదే అందరి చూపు ఉంది. మరి ఈ రకంగా అయినా తన ఫాలోవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్న అదా శర్మకు రాబోయే రోజుల్లో అయినా సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి.