వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్, బోయపాటి శ్రీను క్రేజీ కాంబోలో వస్తున్న వినయ విధేయ రామ సంక్రాంతికి సందడి చేయనుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో భరత్ అనే నేనులో మహేష్ సరసన నటించిన కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆల్బం ఇప్పటికే హిట్ అయ్యింది. రంగస్థలం తర్వాత రాం చరణ్ చేసిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదరగొడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 94.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వినయ విధేయ రామ చరణ్ సత్తా ఏంటో చూపిస్తుంది. రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా తప్పకుండా మరో సంచలనానికి చరణ్ సిద్ధమయ్యాడని అంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ లో వివి ఆర్ చరణ్ కెరియర్ లో హయ్యెస్ట్ సినిమా కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 5గా నిలిచింది.